సాయంత్రం వేళ‌ల్లో ప్ర‌భుత్వ స‌ర్వీసులు బంద్

- April 10, 2021 , by Maagulf
సాయంత్రం వేళ‌ల్లో ప్ర‌భుత్వ స‌ర్వీసులు బంద్

దోహా: కోవిడ్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు మ‌ళ్లీ ఆంక్ష‌ల‌ను క‌ఠినత‌రం చేసే దిశ‌గా ఖ‌తార్ నిర్ణ‌యాలు తీసుకుంటుంది.ఇందుకు అనుగుణంగా కార్మిక మంత్రిత్వ శాఖ కొన్ని కీల‌క నిర్ణ‌యాలు వెల్ల‌డించింది. వ‌చ్చే ఆదివారం నుంచి సాయంత్రం వేళల్లో త‌మ శాఖ ప‌రిధిలోని ప్ర‌భుత్వ కేంద్రాల్లో సేవ‌ల‌ను నిలిపివేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.కోవిడ్ ను అడ్డుకునేందుకు ఆంక్ష‌ల‌ను మ‌ళ్లీ అమ‌లులోకి తీసుకురావాల‌ని ఖ‌తార్ మంత్రివ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యానికి అనుగుణంగా సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు, త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌భుత్వ కేంద్రాల్లో సాయంత్రం వేళల్లో సేవ‌లు అందుబాటులో ఉండ‌వ‌ని ప్ర‌జ‌ల‌కు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com