భారత్ కరోనా అప్డేట్...

- April 11, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్...

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.రోజువారీ కేసులు రోజు లక్షకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా రికార్డ్ స్థాయిలో 1,52,879 కేసులు నమోదయ్యాయి.ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,58,805కి చేరింది.ఇందులో 1,20,81,443 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,08,087 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 839 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో భారత్ లో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1,69,275కి చేరింది.ఇక పాజిటివ్ కేసులతో పాటుగా రికవరీ కేసులు కూడా పెరుగుతున్నాయి.24 గంటల్లో భారత్ లో 90,584 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.ఇక ఇదిలా ఉంటె, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 10,15,95,147 మందికి కరోనా వ్యాక్సిన్ ను పంపిణి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com