కువైట్లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ముమ్మ‌రం..మ‌రో 7 ప్రాంతాల‌కు విస్త‌ర‌ణ‌

- April 11, 2021 , by Maagulf
కువైట్లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ముమ్మ‌రం..మ‌రో 7 ప్రాంతాల‌కు విస్త‌ర‌ణ‌

కువైట్: కోవిడ్ వ్యాప్తిని మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా అడ్డుకునేందుకు కువైట్ త‌మ ప్ర‌య‌త్నాల‌ను మ‌రింత ముమ్మ‌రం చేసింది. ఇందుకోసం వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను పెంచుతోంది. కొత్తగా మ‌రో ఏడు ప్రాంతాల్లో వ్యాక్సిన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్య ప్ర‌స్తుతం 22కి పెరిగింది. దీనికితోడు మొబైల్ వ్యాక్సిన్ యూనిట్ల‌ను కూడా కువైట్ ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే రంగాల్లోని స‌బ్బందికి  ప్రాథాన్యం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వీలైనంత తొంద‌ర‌గా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించ‌టం ద్వారా కోవిడ్ నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌ట‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని కువైట్ స్ప‌ష్ట చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com