ఫస్ట్ డోస్ కవరేజ్ పెంచేందుకు సెకండ్ డోస్ అపాయింట్మెంట్స్ వాయిదా
- April 11, 2021
సౌదీ: కింగ్డమ్ లోని ప్రజల్లో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంగా ఉన్న సౌదీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో సరవణలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న స్టాక్ ను బేరీజు వేసుకొని ముందుగా ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ అందించాలని నిర్ణయించింది. సెకండ్ డోస్ అపాయింట్మెంట్లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఏప్రిల్ 11 నుంచి ఫిక్స్ అయిన సెకండ్ డోస్ అపాయింట్మెంట్లు అన్ని ప్రస్తుతానికి రద్దు కానున్నాయి. సెకండ్ డోసును ఎప్పుడు ఇవ్వనున్నారో త్వరలోనే ప్రకటిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ను ఫస్ట్ డోస్ గా వీలైనంత ఎక్కువ మందికి అందించాలన్నది ఆరోగ్య శాఖ లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ తో వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు అనుకున్న సమయానికి వ్యాక్సిన్ డోసులను పంపిణి చేయటంలో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందుగా ఫస్ట్ డోసులు ఇచ్చి..స్టాక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెకండ్ డోసులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







