మాస్క్‌ ధరించకపోతే రూ.1000 జరిమానా

- April 11, 2021 , by Maagulf
మాస్క్‌ ధరించకపోతే రూ.1000 జరిమానా

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.మాస్క్‌ ధరించకపోతే వెయ్యి జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు,ఇతర ఉన్నతాధికారులకు సూచించింది.జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ప్రజా రవాణా, కార్యాలయాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.ఈ మేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా తిరిగి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి సునిశిత జాగ్రత్తలు పాటించాలని, కరోనా కట్టడి కోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను రండు రోజుల క్రితం కోరారు.మన రాష్ట్రంలో ముఖ్యంగా జనం రద్దీగా వుండే ప్రాంతాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతో పాటు కార్పొరేషన్, మున్సిపాలిటీ ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో  మెలగాలని సీఎం సూచించారు.గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం  వైద్య,ఆరోగ్య శాఖ అధికారులతో,రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో కరోనా తిరిగి పునరావృత మౌతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com