లులు గ్రూప్ అధినేతకు తృటిలో తప్పిన ప్రాణాపాయం..
- April 11, 2021
కేరళ: యూఏఈ లోని ప్రముఖ వ్యాపారవేత్త, లులు గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ.యూసఫ్ అలీ కుటుంబానికి ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది.సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ కొచ్చి సమీపంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.అయితే ఆ హెలికాప్టర్ చిత్తడి నేలలో దిగడంతో పెనుప్రమాదం తప్పిందని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ వి నందకుమార్ మాగల్ఫ్ న్యూస్ కు తెలిపారు.ల్యాండ్ అయిన సమయంలో హెలికాప్టర్లో అలీ దంపతులతో పాటు మరో ముగ్గురు ఉన్నారు.ల్యాండింగ్ తర్వాత వారందరినీ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం వారందరూ వైద్య పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు వెల్లడించారు.హెలికాప్టర్ క్రాష్ అయిన అనంతరం స్థానికులు వారికి సహాయం అందించారు.
ఆసుపత్రిలో చేరిన బంధువును చూడటానికి వారంతా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు. పనంగడ్లోని ఫిషరీస్ కాలేజీ మైదానంలో హెలికాప్టర్ దిగవలసి ఉంది.. కానీ 200 మీటర్ల దూరంలో ఉన్న చిత్తడి నేల మీద హెలికాప్టర్ కుప్పకూలింది.అయితే.. పక్కనే ఎన్‌హెచ్ బైపాస్, విద్యుత్ లైన్లు ఉన్నాయి. చిత్తడి నేలలోనే హెలికాప్టర్ దిగడంతో.. ప్రాణాపాయం.. తప్పిందని పనాంగడ్ పోలీసులు తెలిపారు.మరేదైనా చోట దిగినట్లయితే.. భారీ ప్రమాదం సంభవించేదని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్‌ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









