భారత్ లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్
- April 12, 2021
న్యూ ఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాధికి విరుగుడుగా కోవిడ్ -19 వ్యాక్సిన్ స్పుత్నిక్-వి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ తరువాత భారతదేశం ఆమోదించిన మూడవ టీకా ఇది కావడం విశేషం.
ఒకవైపు కరోనాను ధీటుగా ఎదుర్కొనాలంటే వ్యాక్సినేషనే ఉత్తమ పరిష్కార మార్గమని నిపుణులు చెబుతూ ఉన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకితే సోకవచ్చు. అయితే, అలాంటి వారిపై ఆ వైరస్ ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను నమ్మవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
అరుదుగా మాత్రమే వీటి వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే వ్యాక్సినేషన్ విషయంలో వేగంగా అడుగులు వేసిన వివిధ దేశాల్లో కొత్తగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కూడా మీడియా సంస్థలు చెబుతున్నాయి. 60 శాతం ప్రజలకు మించి వ్యాక్సిన్ వేసిన దేశాల్లో కొత్త కేసుల సంఖ్య చాలా తగ్గిపోయాయని అధ్యయన సంస్థలు కూడా చెబుతున్నాయి.
భారత్‌లో వ్యాక్సిన్ కొరత తీవ్రమవుతోంది.పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. అక్టోబర్ నాటికి భారత్‌లో మరో ఐదు వ్యాక్సిన్లు అందుబాటు లోకి రాబోతున్నాయి. రష్యాకు చెందిన స్నుత్నిక్ వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించడానికి అనుమతిచ్చారు. ఇదే క్రమంలో భారత్‌లో మూడో టీకా అందుబాటు లోకి వచ్చింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి స్పుత్నిక్ వ్యాక్పిన్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది. భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్‌తో పాటు ఐదు కంపెనీలు స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీకి రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ , హెటిరో బయో ఫార్మా ,గ్లాండ్ ఫార్మా ,స్టెల్లీస్ బయో ఫార్మా ,విచ్రో బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
సెకండ్ వేవ్‌తో దేశం వణికిపోతోంది. ప్రతీరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ విలయతాండవంతో.. లక్షల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 12 లక్షలకు పైగా కేసులున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు రెండు రకాల కరోనా టీకాలను అందిస్తోంది.
తొలి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకాలు అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత 45 ఏళ్లుపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 10కోట్ల 45 లక్షల 28వేల 565 డోసుల్ని పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









