కరోనా హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత

- April 12, 2021 , by Maagulf
కరోనా హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సూచనలు, సలహాలు అందించడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తన ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రజలకు సహాయం అందించడానికే ఈ ప్రత్యేక నంబర్లను ఏర్పాటు చేసినట్లు కవిత తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.

ప్రజల నుంచి నిరంతరం ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు. కరోనా సంబంధిత సహాయ, సూచనలకు ఎవరైనా ఫోన్‌ నెంబర్లు 040-23599999 / 8985699999 (హైదరాబాద్‌), 08462- 250666 (నిజామాబాద్ కార్యాలయం)లో సంప్రదించవచ్చని సూచించారు. తన బృందం 24 గంటలు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటుందని ఆ ట్వీట్‌లో కవిత పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com