ఇవాళ రాత్రి నుంచి అమల్లోకి లాక్డౌన్ ఆంక్షలు
- April 14, 2021
మస్కట్: రోజురోజుకీ కరోనా తీవ్రత పెరగుతుండటంతో ఒమన్ ప్రభుత్వం పాక్షిక ఆంక్షల వైపే మొగ్గు చూపింది. ఇవాళ్టి రాత్రి నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించింది. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఉండదు. అలాగే ప్రజలు బయట తిరగకూడదు. అత్యవసర వాహనాలను మినహా మిగిలిన వాహనదారులను అనుమతి ఉండదు. రంజాన్ మాసం మొత్తం లాక్డౌన్ కొనసాగుతుందని ఒమన్ స్పష్టత ఇచ్చింది. ఇదిలాఉంటే ఒమన అధికారులు ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో కరోనా తీవ్రత దృష్ట్యా తారావిహ్ ప్రార్థనలకు కూడా అనుమతి లేదని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







