న‌కిలీ ఉత్ప‌త్తుల అమ్మ‌కాలతో ప‌లు సోష‌ల్ మీడియా అకౌంట్ల మూసివేత‌

- April 14, 2021 , by Maagulf
న‌కిలీ ఉత్ప‌త్తుల అమ్మ‌కాలతో ప‌లు సోష‌ల్ మీడియా అకౌంట్ల మూసివేత‌

యూఏఈ: సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకొని ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌క‌ట‌న‌ల‌తో వినియోగ‌దారుల‌కు న‌కిలీ ఉత్ప‌త్తుల‌ను అమ్ముతున్న ప‌లు సోష‌ల్ మీడియా అకౌంట్ల‌పై యూఏఈ చ‌ర్య‌లు తీసుకుంది. న‌కిలీ ఉత్ప‌త్తులు అమ్ముతున్న‌ట్లు నిర్ధారించుకున్న అకౌంట్ల‌ను తొల‌గించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 727 అకౌంట్ల‌ను ఆర్ధిక మంత్రిత్వ శాక త‌నిఖీ చేసింది. అందులో 334 ఖాతాలు మోస‌పూరిత‌మైన‌వ‌ని నిర్ధారించింది. వీటికి సంబంధించి 129 జ‌రిమానాల‌ను జారీ చేసింది. ఇక గ‌తేడాదిలో 70 వేల అకౌంట్ల‌పై నిఘా వేసి వాటి ప్రామాణిక‌త‌ను ప‌రిశీలించింది. అందులో 997 అకౌంట్ల ద్వారా న‌కిలీ ఉత్ప‌త్త‌ల అమ్మ‌కాలు జ‌రుగుతున్న‌ట్లు తేల్చింది. ఎవ‌రైనా సోష‌ల్ మీడియాను అడ్డాగా చేసుకొని న‌కిలీ ఉత్ప‌త్తులు అమ్ముతున్న‌ట్లు ప్ర‌జ‌లు గుర్తిస్తే వెంట‌నే  టోల్ ఫ్రీ నంబర్ 8001222 ద్వారా త‌మ‌కు ఫిర్యాదు చేయాల‌ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com