'అఖండ'... 5 మిలియన్ వ్యూస్
- April 14, 2021
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఉగాది సందర్భంగా టైటిల్ రోల్ 'అఖండ' అంటూ 'బీబీ3' టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. 'అఖండ' టైటిల్, టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య సినిమా టీజర్ అలా వచ్చి రాగానే వైరల్ అయిపోయింది. వ్యూస్ తో పాటు లైక్స్ కూడా భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాధించింది 'అఖండ' టీజర్. ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది 'అఖండ' టీజర్. కాగా 'అఖండ'లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. పూర్ణ, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







