శంకర్ సినిమా: రణ్వీర్ సింగ్ తో 'అపరిచితుడు' హిందీ రీమేక్
- April 14, 2021

తమిళ మెగా డైరెక్టర్ శంకర్, హిందీ సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది చిత్రబృదం. ఈ విషయాన్ని రణ్వీర్ స్వయంగా తన ఇన్‌స్టాలో ప్రకటించాడు. శంకర్‌తోపాటు ప్రొడ్యూసర్ జయంతిలాల్‌తో కలిసి ఉన్న ఫొటోను రణ్వీర్ ఈ సందర్భంగా షేర్ చేశాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది తమిళ బ్లాక్ బస్టర్ హిట్ అన్నియన్ (2005) చిత్రానికి రీమేక్ వస్తోంది. ఇదే సినిమాను తెలుగులో అపరిచితుడు అంటూ డబ్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్, సదా ప్రధాన పాత్రలో నటించారు.
అది అలా ఉంటే, శంకర్ ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జూన్‌లో ప్రారంభమౌతుందని, సినిమాలో సల్మాన్‌కు ఓ కీలక పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంటుందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నట్లు టాక్. కియారా గతంలో రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామలో నటించిన సంగతి తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







