సీబీఎస్ఈ ప‌రీక్ష‌లపై మోదీ స‌మీక్ష

- April 14, 2021 , by Maagulf
సీబీఎస్ఈ ప‌రీక్ష‌లపై మోదీ స‌మీక్ష

క‌రోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ.. సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వహించడంపై ఇవాళ ప్ర‌ధాని మోదీ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియా,  కేంద్ర విద్యాశాఖ కార్య‌ద‌ర్శితో పాటు ఇత‌ర అధికారులతో ప్రధాని చర్చించనున్నారు.
 
ఢిల్లీలోనే సుమారు ఆరు ల‌క్ష‌ల మంది విద్యార్థులు సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు రాయనున్నారు. వీరి కోసం సుమారు ల‌క్ష మంది టీచ‌ర్లు విధులు నిర్వ‌హించాల్సి ఉంటుంది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పరీక్షల కేంద్రాలు హాట్‌స్పాట్ సెంట‌ర్లుగా మారుతాయ‌ని ఆందోళన వ్యక్తం అవుతోంది.

కరోనా వేళ సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ప్ర‌త్యామ్నాయ విధానాల‌పై ఆలోచన చేయాలని.. ఆన్‌లైన్ విధానం లేదా ఇంట‌ర్న‌ల్ అసెస్‌మెంట్ ద్వారా పిల్ల‌ల‌ను ప్ర‌మోట్ చేయాల‌ని సూచిస్తున్నారు.

‘సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌కంటే.. చిన్నారి విద్యార్థుల జీవితాలు, ఆరోగ్యం ముఖ్యం.  పరీక్షలను రద్దు చేసి.. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి.’ అని నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com