CBSE పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం
- April 14, 2021
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.దీంతో ఇవాళ సమీక్ష సమావేశంలో టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ప్రధాని నిర్ణయం తీసుకొన్నారు. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు.
10వ తరగతి విద్యార్ధులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. ఈ మార్కులతో విద్యార్ధులు సంతృప్తి చెందకపోతే పరీక్షలు రాయవచ్చని కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని తెలిపారుఈ ఏడాది మే 4వ తేదీ నుండి జూన్ 14 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండేది. కరోనా కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఇదే తేదీల్లో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండేది.ఈ ఏడాది జూన్ 1వ తేదీన సమీక్ష నిర్వహించిన తర్వాత తదుపరి పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు.
#cbseboardexams2021#CBSE2021#boardexams2021@SanjayDhotreMP @OfficeOfSDhotre @KVS_HQ @ncert pic.twitter.com/WujnCZurZ8
— CBSE HQ (@cbseindia29) April 14, 2021
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







