'విక్రాంత్ రోణ' విడుదల తేదీ ఖరారు
- April 15, 2021బెంగుళూరు: కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా పాన్ ఇండియా మూవీ 'విక్రాంత్ రోణ' సిద్ధమవుతోంది. సుదీప్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు మేకర్స్.ఈ సినిమా నుంచి ఏప్రిల్ 15న సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా...టీజర్ విడుదలవుతుందని అంతా భావించారు.కానీ మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఆగష్టు 19న 'విక్రాంత్ రోణ' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళంతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో, దాదాపు 50 దేశాల్లో భారీ రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై సుదీప్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాన్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మిస్తున్నారు.బి.అజనీష్ లోక్ నాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.... విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..