సన్‌రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ విజయం
- April 17, 2021
చెన్నై: ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ తడబడింది.151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన సన్‌రైజర్స్ కు అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు ఓపెనర్లు. మొదటి ఆరు ఓవర్లలో 57 పరుగులు చేసి ఈ ఐపీఎల్ లో మొదటి గెలుపు పైన నమ్మకాన్ని కల్పించారు. కానీ ఆ నమ్మకాన్ని తర్వాత వచ్చిన ఆటగాళ్లు నిలబెట్టలేక పోయారు. బెయిర్‌స్టో(43) ఔట్ అయిన తర్వాత స్లో అయిన హైదరాబాద్ మళ్ళీ రైజ్ కాలేదు. చివర్లో విజయ్ శంకర్(28)తో కొంత ఆశ కలిగించిన అది నిరాశగానే మిగిలిపోయింది. హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ బాట పట్టడంతో 19.4 ఓవర్లలోనే 137 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. దాంతో 13 పరుగులతేడాతో ఈ ఐపీఎల్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది ముంబై.
అయితే మొదట ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ కు కూడా ఓపెనర్లు మంచి ఆరంభానే అందించారు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు హైదరాబాద్ బౌలర్లు. అయిన చివర్లో ముంబై స్టార్ హిట్టర్ పొలార్డ్(35) రాణించడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







