రమదాన్ మాసంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు అల్లాహ్ గిఫ్ట్
- April 18, 2021
సౌదీ: పవిత్ర రమదాన్ మాసంలో సౌదీ రాజకుటుంబానికి ఓ శుభవార్త అందింది. మరో బుల్లి రాకుమారుడు జన్మించడంతో రాజకుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. వివరాల్లోకి వెళితే..
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ మరోసారి తండ్రి అయ్యారు. దాంతో యువరాజు పేరును కలిగి ఉన్న హ్యాష్‌ట్యాగ్ 'ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ మొహమ్మద్ బిన్ సల్మాన్' ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పుట్టిన శిశువుకు క్రౌన్ ప్రిన్స్ తాత..సౌదీ యొక్క దివంగత వ్యవస్థాపకుడు కింగ్ అబ్దులాజీజ్ పేరును పెట్టారు.
ఈ సందర్భంగా..రాజకుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యం మరియు సంతోషంతో కలకాలం వర్ధిల్లాలి అంటూ శ్రేయోభిలాషులు మరియు సన్నిహితులు క్రౌన్ ప్రిన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







