మే 1 నుంచి 18 ఏళ్ళు దాటిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్
- April 19, 2021
న్యూ ఢిల్లీ: పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ -19 కు టీకాలు వేయడానికి అర్హులేనని అని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది, కరోనా వ్యాక్సిన్ సరళీకృత మరియు వేగవంతమైన దశ 3 గా దీనిని చెబుతున్నారు.ముందు మెడికల్, పోలీస్ లాంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వగా తర్వాత 60 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చారు. తరువాత 45 ఏళ్ళ వారికి ఇచ్చారు. అయితే కరోన కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయిన్చేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న అనేక ముఖ్యమైన నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. దీంతో వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తిని మరింత పెంచడానికి భారత ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వ్యాక్సిన్ తయారీదారులు తమ సరఫరాలో 50% వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి సిద్ధం అయితే మిగతాది ఓపెన్ మార్కెట్ లో ముందే నిర్ణయించిన రేటుకు అమ్ముకోవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







