ప్లాస్టిక్ బ్యాగ్ లో Dh1m డబ్బుతో సైకిల్ ప్ర‌యాణం..ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?

- April 20, 2021 , by Maagulf
ప్లాస్టిక్ బ్యాగ్ లో Dh1m డబ్బుతో సైకిల్ ప్ర‌యాణం..ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?

దుబాయ్: ఓ వ్య‌క్తి మిలియ‌న్ దిర్హామ్ ల డబ్బును  ఓ ప్లాస్టిక్ బ్యాగులో వేసుకున్నాడు.సైకిల్ ఎక్కి బ్యాంకు బ‌య‌ల్దేరాడు.అంత పెద్ద మొత్తంలో డ‌బ్బులు అంత సింపుల్ గా అంద‌రికి తెలిసేలా ప్లాస్టిక్ బ్యాగులో వేసుకొని సైకిల్ పై వెళ్తున్న ఆ వ్య‌క్తిని అంతా అశ్చ‌ర్యంగా చూస్తుండిపోయారు. అయితే..అత‌ని నిర్ల‌క్ష్యాన్ని చూసి తిక్క‌రేగిన పోలీసులు మాత్రం చూస్తూ ఊరికే ఉండ‌లేక‌పోయారు.వెంట‌నే అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లి డ‌బ్బు గ‌రించి ఆరా తీసి...నేరాల‌ను ఆస్కారం ఇచ్చేలా నిర్ల‌క్ష్యం వ్య‌వ‌హ‌రించ‌టం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.అత‌నికి ఫైన్ వేశారు.దుబాయ్ ఎమిరాతి ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటు చేస‌కుంది.బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసేందుకు అలా ప్లాస్టిక్ బ్యాగ్ లో మిలియన్ దిర్హామ్ ల‌ను సైకిల్ పై తీసుకెళ్తున్న‌ట్లు త‌మ విచార‌ణ‌లో తేలింద‌ని పోలీసులు చెబుతున్నారు.నేరాల‌కు ఆస్కారం ఇచ్చేలా డ‌బ్బుల విష‌యంలో ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని, బ్యాంకులు, మ‌నీ ఎక్సెంజ్ కేంద్రాల ద‌గ్గ‌ర త‌ప్ప‌నిస‌రిగా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు సూచించారు.జ‌నం ఉన్న ప్ర‌దేశంలో డ‌బ్బులు బ‌య‌టికి తీసి లెక్క‌పెట్ట‌డం వంటివి కూడా సేఫ్టీ ప్రోటోకాల్ ప్ర‌కారం త‌ప్పేన‌ని ప్ర‌జ‌లు గుర్తుంచుకోవాల‌న్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com