కరోనా పేషెంట్‌ను బంధించిన హాస్పిటల్ యాజమాన్యం
- April 20, 2021
హైదరాబాద్: బేగంపేట్‌లోని విన్ హాస్పిటల్ యాజమాన్యం డబ్బుల కోసం కరోనా రోగిని బంధించిన వైనం వెలుగుచూసింది.నాలుగు లక్షలు కడితే డిశ్చార్జీ చేస్తామని విన్ ఆస్పత్రి యాజమాన్యం చెబుతోందని కోవిడ్ పేషెంట్ రామారావు ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసాడు. కరోనా పాజిటివ్‌తో ఈనెల 1న బేగంపేట్ విన్ ఆస్పత్రిలో చేరాడు.అయితే తనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటంతో చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తామే క్లయిమ్ చేసుకుంటామని వైద్యులు చెప్పారని రామారావు అంటున్నాడు.కోవిడ్ కోసం అడ్మిట్ అయితే అనవసరమైన టెస్టుల చేసి నాలుగు లక్షల రూపాయలు బిల్లు చేసారని ఆరోపించాడు.కనీసం గుండె జబ్బు ఉందని ప్రాధేయ పడినా యాజమాన్యం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ కోవిడ్ పేషెంట్ రామారావు బంధువులు.. మంత్రి కేటీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేసారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







