మరోసారి ఇంద్రగంటి-సుధీర్ బాబు కాంబినేషన్ లో సినిమా
- April 20, 2021
హైదరాబాద్: ఇంద్రగంటి మోహనకృష్ణ పేరు వినగానే వైవిధ్యంతో తెరకెక్కిన ‘అష్టా-చమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘జెంటిల్మేన్’, ‘అమీ తుమీ’, 'సమ్మెహనం' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. మూడేళ్ల క్రితం సుధీర్ బాబు, అదితీరావు హైదరితో ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా నేపథ్యంగా తీసిన ‘సమ్మోహనం’ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ తరువాత సుధీర్ బాబు, నానితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘వీ’ తెరకెక్కించాడు ఇంద్రగంటి. పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ నటించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై అంతగా ఆకట్టుకోలేపోయింది. ఆ తర్వాత బాక్సీఫీస్ వద్ద కూడా చతికిలపడింది.ఇప్పుడు సుధీర్ బాబుతో మరో సినిమా చేస్తున్నాడు ఇంద్రగంటి. దీనికి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే టైటిల్ ని నిర్ణయించారు. ‘సమ్మోహనం’ తరహాలో ఈ చిత్రం కూడా సినిమా నేపధ్యంలో తెరకెక్కుతోంది. డైరక్టర్ గా చేస్తున్న ఓ వ్యక్తి కొన్ని సరదా సంఘటనలు సీరియస్ విషయానికి లీడ్ చేసి సమస్యలో పడేస్తే ఏం చేస్తాడు? వాటిని ఎలా తెలివిగా డీల్ చేసి సినిమా పూర్తి చేసాడన్నదే సినిమా కథ అట. ఇందులో సుధీర్ కి జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ఇతర ముఖ్యపాత్రధారులు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







