కొత్త విధానంలో పార్కింగ్ ఫీజు చెల్లింపుపై డ‌బ్బు ఆదా

- April 21, 2021 , by Maagulf
కొత్త విధానంలో పార్కింగ్ ఫీజు చెల్లింపుపై డ‌బ్బు ఆదా

దుబాయ్: డిజిట‌ల్ విధానంలో పార్కింగ్ ఫీజు చెల్లించి డ‌బ్బు ఆదా చేసుకోవ‌చ్చ‌ని దుబాయ్ ఆర్టీఏ వెల్ల‌డించింది. ఇందుకోసం యాప్ క్లిప్స్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే..ఇది కేవ‌లం ఐఫోన్ ఉన్న‌వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అంతేకాదు...యాప్ క్లిప్స్ ను ప్ర‌త్యేకంగా ఫోన్ లో ఇన్ స్టాల్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆర్టీఏ దుబాయ్ యాప్ లోనే అంత‌ర్గ‌తంగా యాప్ క్లిప్స్ ఉంటుంది. ప‌బ్లిక్ పార్కింగ్, సైన్ బోర్డుల‌పై ఉన్న క్యూఆర్ కోడ్ ను ఐఫోన్ తో స్కాన్ చేయ‌గానే ఐఫోన్ పేకి రిడైరెక్ట్ అవుతుంది. ఆ వెంట‌నే పార్కింగ్ ఫీజు చెల్లించ‌వ‌చ్చు.దీంతో ఒక‌సారి చెల్లింపుపై 30 ఫిలాను ఆదా చేసుకోవ‌చ్చ‌ని ఆర్టీఏ స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం 70 శాతం పార్కింగ్ ప్రాంతాలు, సైన్ బోర్డుల ద‌గ్గ‌ర క్యూఆర్ కోడ్ లు ఉన్నాయ‌ని...త్వ‌ర‌లోనే అన్ని ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేస్తామ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com