5 నెలల వేతన బకాయిలు చెల్లించాలని కంపెనీకి ఆదేశం
- April 21, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, ఓ సెక్యూరిటీ కంపెనీకి 24 గంటల సమయమిచ్చింది స్కూల్ గార్డులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించేందుకు. అథారిటీ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఓ స్కూల్ గార్డు, తనకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదని వాపోతూ ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. సంబంధిత అధికారులు, ఈ ఘటనపై స్పందించారు. అధికారులు, ఆ గార్డు పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళి పరిస్థితిని తెలుసుకున్నారు. సదరు గార్డుతోపాటు మిగతా గార్డులకూ వేతనాలు అందలేదని గుర్తించి, కంపెనీ వెంటనే వేతన బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







