మ‌హారాష్ట్ర కరోనా అప్డేట్

మ‌హారాష్ట్ర కరోనా అప్డేట్

ముంబై: మ‌హారాష్ట్రలో మ‌రోసారి భారీగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. తాజా కేసుల‌తో క‌లుపుకొని ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 ల‌క్ష‌ల మార్క్‌ను కూడా దాటేసింది.. మ‌హారాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుద‌ల చేసిన కోవిడ్ బులెటిన్‌లో 67,468 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 568 మంది మృతిచెందారు.ఇక‌, ఇదే స‌మ‌యంలో 54,985 మంది కోవిడ్ బాధితులు కోలుకున్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 40,27,827కు చేరుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 32,68,449 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6,95,747 యాక్టివ్ కేసులు ఉండ‌గా..  దేశంలోనే కోవిడ్ మ‌ర‌ణాల్లో తొలి స్థానంలో నిలిచిన ఆ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 61,911 మంది మృతిచెందారు. 

Back to Top