దుబాయ్ లో సైబ‌ర్ బెగ్గ‌ర్ అరెస్ట్

- April 22, 2021 , by Maagulf
దుబాయ్ లో సైబ‌ర్ బెగ్గ‌ర్ అరెస్ట్

దుబాయ్: ర‌మ‌దాన్ మాసం కావ‌టంతో బిచ్చ‌గాళ్ల రూపంలో కొంద‌రు వ్య‌క్తులు డ‌బ్బులు దండుకునేందుకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. డ‌బ్బుల కోసం వాట్సాప్ లో బిచ్చ‌మెత్తుకుంటున్న అర‌బ్ వ్య‌క్తిని అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. జాలి క‌లిగించేలా సందేశాలు పంపుతూ త‌న‌కు డ‌బ్బు దానం చేయాల్సిందిగా వేడుకుంటున్న‌ట్లు పోలీసులు వివ‌రించారు. ఇలా మెయిల్స్ పంపి, వాట్సాప్ లో మెసేజ్ లు పంపి డ‌బ్బులు అడుక్కునే వారిపై ఎట్టి ప‌రిస్థితుల్లోనూ  జాలి చూపించొద్ద‌న్నారు. ఇదిలాఉంటే...బిచ్చ‌మెత్తుకోవ‌ట‌మే వృత్తిగా పెట్టుకున్న‌వారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని..Dh100,000 జ‌రిమాన ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com