కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..13 మంది సజీవ దహనం

కోవిడ్ ఆస్పత్రిలో  అగ్ని ప్రమాదం..13 మంది సజీవ దహనం

మహారాష్ట్ర: మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాల్గర్ జిల్లాలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ కరోనా ఆస్పత్రిలోని ఐసీయూ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని సమాచారం అందింది.  
ఈ అగ్ని ప్రమాదంలో 13 మంది కరోనా బాధితులు సజీవదహనమయ్యారు.ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది.చాలామంది గాయాలపాలయ్యారు.

ఇంకా చాలామంది బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. అధికారులు, పోలీసులు చేరుకొని రెస్క్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Back to Top