కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 8 మంది అరెస్ట్

కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 8 మంది అరెస్ట్

ఒమ‌న్: కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 8 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు ఒమ‌న్ పోలీసులు వెల్ల‌డించారు.వైర‌స్ వ్య‌ప్తి నియంత్ర‌ణ‌కు సుప్రీం క‌మిటీ సూచించిన అన్ని నిబంధ‌న‌ల‌ను ప్ర‌జ‌లు త‌ప్ప‌నిసరిగా పాటించాల‌ని కోరారు.త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌టంతో పాటు స‌మాజంలోని తోటి వారి ఆరోగ్య భ‌ద్ర‌త‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాల‌న్నారు.అరెస్టైన ఎనిమిది మందిలో హోం క్వారంటైన్ నిబంధ‌న పాటించ‌నివారితో పాటు...వాణిజ్య నిబంధ‌న‌లు, లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన వారు ఉన్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

 

Back to Top