కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని 300 మందిపై కేసులు

కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని 300 మందిపై కేసులు

ఖతార్: సెకండ్ వేవ్ రూపంలో ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కోవిడ్ ను అరిక‌ట్టేందుకు చ‌ర్య‌ల‌ను మ‌రింత ముమ్మ‌రం చేస్తోంది ఖ‌తార్ అంత‌ర్గ‌త మంత్రిత్వ శాఖ‌. మాస్కులు పెట్టుకోకున్నా, భౌతిక దూరం పాటించ‌కున్నా, వాహ‌నాల్లో ప‌రిమితికి మించి ప్ర‌యాణం చేసినా కేసులు న‌మోదు చేస్తోంది. ఇటీవ‌లి కాలంలో దేశ‌వ్యాప్తంగా 381 మందిపై కోవిడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద‌ కేసులు న‌మోదు చేసిన‌ట్లు మినిస్ట్రి కార్యాల‌యం వెల్ల‌డించింది. ఇందులో 322 మంది మాస్కులు పెట్టుకోలేద‌ని, 56 మంది భౌతిక దూరం పాటించ‌లేద‌ని వివ‌రించింది. మిగిలిన వాళ్లు వాహ‌నాల్లో ప‌రిమితి మించి ప్ర‌యాణం చేయ‌టం వ‌ల్ల కేసులు న‌మోదు చేసి ప‌బ్లిక్ ప్రాసిక్యూష‌న్ కు త‌ర‌లించామ‌ని వెల్ల‌డించింది. కోవిడ్ నిబంధ‌న‌లను అమ‌లు చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న మంత్రిత్వ శాఖ ఇప్ప‌టివ‌ర‌కు వేల కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Back to Top