భారత్: రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు,మరణాలు...

భారత్: రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు,మరణాలు...

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి భారీగా విజృంభిస్తోంది.కేసులు రోజు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా భారత్లో 3,32,730 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695కి చేరింది.ఇందులో 1,36,48,159 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 24,28,616 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 2,263 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,80,920కి చేరింది.

Back to Top