న‌డిరోడ్డుపై కారు రేసింగ్‌లు..ముగ్గురు అరెస్ట్

న‌డిరోడ్డుపై కారు రేసింగ్‌లు..ముగ్గురు అరెస్ట్

యూఏఈ: అర్ధ‌రాత్రి వేళ రోడ్ల‌పై కార్లతో స్టంట్లు చేస్తున్న ముగ్గురు బ‌రితెగింపు యువ‌కుల‌ను అబుధాబి పోలీసులు అరెస్ట్ చేశారు. తోటి స్నేహితుల‌ను వెంట‌బెట్టుకొని వారు చూస్తుండ‌గా...ఈ ముగ్గురు యువ‌కులు అతి వేగంగా కార్ల‌ను న‌డుపుతూ స్టంట్లు నిర్వ‌హిస్తున్నార‌ని...నివాస ప్రాంతాల‌తో పాటు...హైవేపై కూడా వారి ప్ర‌మాద‌క‌ర విన్యాసాలు కొన‌సాగాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. తెల్ల‌వారుజాము వ‌ర‌కు విన్యాసాల‌ను కొన‌సాగించార‌ని అన్నారు. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర విన్యాసాల‌ను స‌హించ‌బోమ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. కారుతో డేంజ‌ర‌స్ స్టంట్లు చేసిన ముగ్గురు వ్య‌క్తుల‌తో పాటు వారి విన్యాసాల‌ను చూసేందుకు వెళ్లిన యువ‌కుల‌ను కూడా అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వివ‌రించారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌టంతో పాటు రోడ్డుపై ఇత‌ర వాహ‌న‌దారుల ప్రాణాల‌కు హ‌ని క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించిన యువ‌కుల‌ను ప‌బ్లిక్ ప్రాసిక్యూష‌న్ కు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

 

Back to Top