ఈద్ పండ‌గ నాటికి క‌ర్ఫ్యూ ఎత్తివేసే అవ‌కాశాలు

ఈద్ పండ‌గ నాటికి క‌ర్ఫ్యూ ఎత్తివేసే అవ‌కాశాలు

కువైట్ సిటీ: కోవిడ్ వ్యాప్తితో అల్లాడిపోతున్న ప్ర‌జ‌ల‌కు కువైట్ ఉన్న‌తాధికారుల నుంచి ఆశాజ‌న‌క ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కోవిడ్ కేసుల‌తో భ‌య‌పోతున్న కువైట్ ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిచ్చేలా కొద్ది రోజులుగా వైర‌స్ బాధితుల సంఖ్యలో పెరుగుద‌ల న‌మోదు చేసుకోవ‌టం లేద‌ని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. ఐసీయూ, ఆస్ప‌త్రిల్లో ఇన్ పేషెంట్లుగా చేరుతున్న వారి సంఖ్య‌లోనూ పెరుగుద‌ల ఉండ‌టం లేద‌ని అంటున్నారు. అంటే కోవిడ్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు తాము చేప‌ట్టిన ప్ర‌య‌త్నాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని, వ్యాక్సినేష‌న్ ప్రోగ్రాం కూడా ఇందుకు ఓ కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ప‌రిస్థితి ఇలాగే ఉంటే మే రెండో వారంలోనే క‌ర్ఫ్యూను స‌డ‌లించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఈద్ స‌మ‌యానికి ఎలాంటి ఆంక్ష‌లు లేని వాత‌వ‌ర‌ణంలో పండ‌గ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే విమాన ప్ర‌యాణాల‌పై కూడా ఆంక్ష‌లు స‌డ‌లించే రోజు కూడా ఎంతో దూరంలో లేద‌ని కువైట్ ఉన్న‌తాధికారులు అంచ‌నా వేస్తున్నారు. జులై 1 త‌ర్వాత ఆంక్ష‌లు స‌డ‌లించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సూచ‌న‌ప్రాయంగా చెబుతున్నారు. అయితే..ప‌లు దేశాల్లో చిక్కుకుపోయిన కువైట్ పౌరుల‌ను తీసుకొచ్చేందుకు మాత్రం ప‌లు దేశాల‌కు నేరుగా విమాన స‌ర్వీసుల‌ను అనుకున్న స‌మ‌యానికంటే ముందుగానే ప్ర‌య‌త్నాలు జ‌ర‌గొచ్చ‌ని...ఈ విష‌యంపై రాబోయే మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వివ‌రించారు. 

 

Back to Top