కోవిడ్ రూల్స్ బ్రేక్... 2 రెస్టారెంట్లు, ఓ బార్బర్ షాప్ క్లోజ్
- April 23, 2021అజ్మన్: కరోనా వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలో అర్ధంగాక ప్రభుత్వాలు, అధికారులు తలలు బాదుకుంటుంటే...కొందరిలో మాత్రం ఆ సోయే లేకుండా పోతోంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, బార్బర్ సెలూన్ వంటి సెక్టార్లలో ఉండే వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ, అజ్మన్ పరిధిలోని రెండు రెస్టారెంట్లు, ఓ బార్బర్ సెలూన్లో మాత్రం నిర్వాహకులు కోవిడ్ రూల్స్ కనీసం పాటించాల్సిన నిబంధనలను కూడా పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అజ్మన్ పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు, విపత్తు నిర్వహణ స్థానిక అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం తేటతెల్లమైంది. 2 రెస్టారెంట్లు, బార్బర్ షాపులోని సిబ్బంది మాస్కులు లేకుండా, చేతికి గ్లౌజులు వేసుకోకుండా, నెత్తికి హెడ్ కవిరింగ్స్ వేసుకోకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు..వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైనా ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోలేదు. పైగా ప్రతి వారం పీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉన్నా..అదీ కూడా చేయలేదు. ఇలా ప్రతీ విషయంలోనూ కోవిడ్ రూల్స్ బ్రేక్ చేయటంతో 2 రెస్టారెంట్లతో పాటు బార్బర్ షాప్ ను మూసివేస్తున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?