225 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌: సీపీ మహేష్‌ భగవత్‌

- April 23, 2021 , by Maagulf
225 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌: సీపీ మహేష్‌ భగవత్‌

హైదరాబాద్: కరోనా సెకండ్‌ వేవ్‌లో తీవ్ర స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మొదటి కంటే ఈ రెండో దశలో రెట్టింపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. ఇక రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 225 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలో 95 శాతం మంది సిబ్బందికి వ్యాక్సిన్‌ పూర్తయిందని, మిగిలిన వారికి కూడా వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో ఆత్మ స్థైర్యం పెంపొందించేందుకు తనతోపాటు ఇతర అధికారులు జూమ్‌ ద్వారా తరచూ మాట్లాడుతున్నామని అన్నారు. వీరిలో కేవలం నలుగురు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. వైరస్‌ బారిన పడ్డ వారికి మెడికల్‌ కిట్స్‌, డ్రైఫ్రూట్స్‌ కిట్స్‌తోపాటు రూ.5వేలు వారి ఖాతాల్లో వేస్తున్నామని అన్నారు.

కాగా, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. కమిషనరేట్‌ పరిధిలో 43 ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.ఇక్కడ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సిబ్బంది ఉంటారని తెలిపారు.ఇప్పటి వరకు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 200 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.ఈ వారం రోజుల వ్యవధిలో మాస్కులు ధరించని వారిపై16 వేల కేసులు నమోదు అయినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com