భారత్ నుంచి విమానాల రాకను రద్దు చేసిన కువైట్
- April 24, 2021
కువైట్ సిటీ: భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరగటంతో గల్ఫ్ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. కువైట్ ఏకంగా భారత్ నుంచి అన్ని కమర్శియల్ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కువైట్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఏప్రిల్ 24 శనివారం నుంచే విమానాల రద్దు అమలులోకి రానుంది. భారత్ నుంచి ఇతర దేశాల మీదుగా కువైట్ వచ్చే ప్రయాణికులు..ఆయా దేశాల్లో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని వెల్లడించింది. అయితే..కువైట్ పౌరులు, వారి రక్త సంబంధీకులు, డొమస్టిక్ వర్కర్లకు ఈ నిబంధన వర్తించదు. ఇదిలాఉంటే కమర్షియల్ విమానాలపై నిషేధం ఉన్నా...కార్గో విమానాలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవి..అవి యధావిధిగా కొనసాగుతాయని కూడా స్పష్టటం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







