భారత్: రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు...

- April 24, 2021 , by Maagulf
భారత్: రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు...

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మూడు లక్షలు దాటాయి కరోనా కేసులు.రోజువారీ కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచ రికార్డ్‌ సృష్టించింది. దేశంలో కొత్తగా 3.46 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.ఒక్కరోజులోనే 2,620 మంది మృతి కరోనా చనిపోవడం కలిచివేస్తోంది. ఇక, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 25,43,914 కరోనా యాక్టివ్ కేసులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 1,89,549 మంది చనిపోయారు. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ సోకిన వారి సంఖ్య 1,66,02,456కి చేరింది.

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తునే ఉంది. రోజు రోజుకీ కొత్త రూపం మార్చుకుంటూ విస్తరిస్తుంది. దేశంలో ప్రతి గంటకు 14,373 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కరోనాతో గంటకు 109 మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల్లో 773 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 348 మంది చనిపోయారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 66,836 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 24,331 కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com