ఏపీ కరోనా అప్డేట్
- April 24, 2021_1619277062.jpg)
అమరావతి: ఏపీలో కూడా కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.రోజువారి పాజిటివ్ కేసులు పదకొండు వేలు దాటిపోయాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,972 శాంపిల్స్ పరీక్షించగా 11,698 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 37 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.. కోవిడ్ బారిన పడి కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో ఆరుగురు, నెల్లూరు లో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, చిత్తూర్ లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు మరియు ప్రకాశం లో ఒక్కరు చొప్పున మరణించారు.ఇదే సమయంలో 4,421 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,20,926కు చేరగా.. యాక్టివ్ కేసులు 81,471గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 9,31,839 కరోనా నుంచి కోలుకోగా 7,616 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!