తెలంగాణలో అదనంగా 12,000 బెడ్స్
- April 24, 2021
హైదరాబాద్: రానున్న రోజుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన 12 వేల అదనపు బెడ్స్ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్ లు వైద్య అధికారులతో సీఎస్ సోమేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆక్సిజన్ తో అదనంగా 12000 పడకల ఏర్పాటుకు 20 కోట్లు మంజూరు చేస్తున్నామని,అవసరమైన తాత్కాలిక సిబ్బంది నియామకం చేయాలనీ ఆదేశించారు.ఒక్క యూనిట్ ఆక్సిజన్ కూడా వృధా కావద్దన్న ఆయన వచ్చిన ప్రతి పేషెంట్ ను చేర్చుకోవాలని అన్నారు.బోధన ఆసుపత్రుల్లో అన్ని వసతులను వాడుకోవాలని ఆయన అన్నారు.‘‘రోగుల పరిస్థితులకు అనుగుణంగా అన్ని ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆయన స్వల్ప లక్షణాలున్న వారికి చికిత్స కోసం కరోనా కేర్ సెంటర్లను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని అన్నారు.జిల్లా వైద్యాధికారులు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలతో కలెక్టర్లు రోజుకు రెండు మార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్న ఆయన అవకాశం ఉన్న చోట వార్డులను కొవిడ్ వార్డులుగా మార్చి ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ సౌకర్యం కల్పించాలని అన్నారు.
తాజా వార్తలు
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!







