కరోనా బీభత్సం.. లాక్డౌన్ పొడగింపు దిశగా కేజ్రీవాల్ సర్కార్
- April 25, 2021
ఢిల్లీ: దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇదే ఈ క్రమంలో కొత్త వ్యాక్సిన్లు, మందులకు కూడా అత్యవసర వినియోగం కోసం అనుమతులు ఇస్తోంది. ఇటు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అయినా కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులకు తోడు మరణాల సంఖ్యకు అధికంగా ఉంటోంది. కేసుల తీవ్రతతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతగా ఏర్పడింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో లాక్డౌన్ పొడిగించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







