భారత్‌కు రూ.135 కోట్ల సహాయం ప్రకటించిన గూగుల్ !
- April 26, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా విలయం మామూలుగా లేదు.ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఇదే పరిస్థితి కొనసాగితే..భారత్ మరింత డేంజర్ లో పడనుంది.ఇలాంటి సమయంలో భారత్ కు సహాయం చేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ ముందుకు వచ్చింది.ఏకంగా రూ.135 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గీవ్ ఇండియాకు,యూనిసెఫ్ కు ఈ ఫండ్ అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇండియాకు సహాయమందించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ లాంటి దేశాలతో పాటు పాకిస్థాన్ కూడా ముందుకు వచ్చింది.కొవిషీల్డ్ టీకా తయారీకి అవసరమైన ముడి పదర్థాలను భారత్‌కు పంపాలని అమెరికా నిర్ణయించింది.అలాగే ఇండియా కు ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ కూడా ఒక అడుగు ముందుకు వేశాయి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం