కోవిడ్ తో టాలీవుడ్ దర్శకుడు మృతి!
- April 26, 2021
హైదరాబాద్: సినిమా దర్శకుడు, రచయిత ఎన్. సాయి బాలాజీ ప్రసాద్ (ఎన్. వర ప్రసాద్ ) కోవిడ్-19తో హైదరాబాద్ గచ్చిబౌలి లోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు ఝామున మరణించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు దర్శకుడిగా సాయి బాలాజీ ప్రసాద్ పనిచేశారు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు.
మెగాస్టార్ హీరోగా నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ”బావగారు బాగున్నారా" చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన వారిలో ఒకరు.తిరుపతి ఆయన స్వస్థలం. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో తర్ఫీదు పొందారు.సాయి బాలాజీ ప్రసాద్ కి భార్య గౌరీ, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. సినిమా, టివి రంగాలకు చెందిన పలువురు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!