ఢిల్లీలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ - కేజ్రీవాల్
- April 26, 2021
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే ఇవ్వనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. మొత్తం 1.34 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలు కోసం అనుమతి ఇచ్చాము. సాధ్యమైనంత త్వరగా వాటిని కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము అని కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వాళ్లు డబ్బులు చెల్లించాల్సి రావచ్చు.
ఇక రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ల ధరలను తగ్గించాలని కేజ్రీవాల్ తయారీదారులను కోరారు. డోసు రూ.150కే ఇవ్వాలని నేను కోరుతున్నాను. మీరు లాభాలు ఆర్జించడానికి మొత్తం జీవితకాలం ఉంది. కానీ ఇప్పుడు కరోనా విరుచుకుపడిన సమయంలో ఇలా చేయడం సరి కాదు. వ్యాక్సిన్ల ధరలపై పరిమితి విధించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అని కేజ్రీవాల్ అన్నారు.
ఒకరు రాష్ట్రాలకు రూ.400కు ఇస్తామని, మరొకరు రూ.600కు ఇస్తామన్నారు. కేంద్రానికి మాత్రం రూ.150 కే ఇస్తామంటున్నారు. అందరికీ ఒకే ధర ఉండాలి అని కేజ్రీవాల్ కోరారు. అయితే కేంద్రం మాత్రం ఇప్పటికే తయారీదారుల నుంచి రూ.150కి కొని వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!