కోవిడ్ డిజిటల్ వెరిఫికేషన్ ప్రారంభించిన ఎమిరేట్స్, డీహెచ్ఏ
- April 27, 2021
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు చెక్ ఇన్ మరింత సులభం కానుంది. కోవిడ్ నేపథ్యంలో పీసీఆర్ టెస్ట్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇక వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, దుబాయ్ ఆరోగ్య శాఖ మధ్య ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం మేరకు దుబాయ్ పరిధిలో పీసీఆర్ టెస్ట్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ వివరాల డేటాను ఎమిరేట్స్ తో పంచుకోనుంది. అంటే ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో టికెట్ బుక్ చేసుకునే వ్యక్తి దుబాయ్ లో పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే అతను ప్రయాణ సమయంలో పీసీఆర్ రిపోర్ట్ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ వెరిఫికేషన్ తోనే ప్రయాణికుల కోవిడ్ రికార్డ్ ను పరిశీలించి చెక్ ఇన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
తాజా వార్తలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!









