మే 1 న భారత్ కు స్పుత్నిక్ వ్యాక్సిన్

- April 27, 2021 , by Maagulf
మే 1 న భారత్ కు స్పుత్నిక్ వ్యాక్సిన్

ఇండియా: రష్యాలో తయారైన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ 'మే 1న' ఇండియాకు చేరనుంది. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారీలో భాగమైన ఆర్డీఐఎఫ్‌ హెడ్‌ కిరిల్‌ దిమిత్రీవ్‌ వెల్లడించారు. ఎన్ని వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నామన్న విషయాన్ని ప్రస్తావించని ఆయన తొలి బ్యాచ్‌గా టీకాలు పంపుతున్నామని ఆపై వరుసగా వయల్స్‌ వెళతాయని స్పష్టం చేశారు. ఇక ఇండియాకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. ఇదిలా ఉండగా మరో నెల రోజుల వ్యవధిలో 5కోట్ల వరకూ స్పుత్నిక్‌-వీ డోస్‌లు ఇండియాకు అందించాలని ఆర్డీఐఎఫ్‌ ఇప్పటికే నిర్ణయించింది. ఇవి దశలవారీగా ఇండియాకు చేరనున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com