శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..
- April 29, 2021
హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక కోటి 36 లక్షలు విలువ చేసే బంగారాన్ని గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి బంగారం తరలిస్తున్నాడనే సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం EK-526 విమానం ద్వారా దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేశారు.ఈ తనఖీలో ప్రయాణికుడి నుంచి 2.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు ఒక కోటి 36 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







