ఖతార్: సెకండ్ డోస్ వ్యాక్సిన్ పై కీల‌క‌ సూచ‌న‌లు

- April 30, 2021 , by Maagulf
ఖతార్: సెకండ్ డోస్ వ్యాక్సిన్ పై కీల‌క‌ సూచ‌న‌లు

దోహా: కోవిడ్ సెకండ్ డోస్ కు సంబంధించి ఖ‌తార్ ఆరోగ్య శాఖ కొన్ని కీల‌క సూచ‌న‌లు చేసింది. తొలి డోస్ తీసుకున్న వారికి రెండు ప‌ద్ద‌తుల్లో సెకండ్ డోస్ ఇస్తున్న‌ట్లు వివ‌రించింది. డ్రైవ్ త్రూ ద్వారాగానీ, నిర్ణీత టైం స్లాట్ లో ఆరోగ్య కేంద్రాల‌కు వెళ్లిగానీ సెకండ్ డోస్ తీసుకొచ్చ‌ని వివ‌రించింది. అయితే..డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ సెంట‌ర్లు, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు వెళ్లే వారు పాటించాల్సిన నిబంధ‌న‌లను మ‌రోసారి గుర్తు చేసింది. ఆరోగ్య కేంద్రాల్లో రెండో డోస్ తీసుకోవాల‌నుకునే వారు తొలి డోసు తీసుకున్న ఆరోగ్య కేంద్రంలోనే సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్న వారిని మాత్ర‌మే అనుమ‌తిస్తారు. అపాయింట్మెంట్ లేకుండా వ్యాక్సిన్ ఇవ్వ‌రు. అలాగే సెకండ్ డోస్ తీసుకునే వారికి ఎతెరాజ్ గ్రీన్ స్టేట‌స్ ఉండాలి, వ్యాక్సినేష‌న్ కార్డుతో పాటు, ఖ‌తార్ ఐడీ కార్డును వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సెకండ్ డోస్ కోసం డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ కేంద్రాల‌కు వెళ్లలేక‌పోయిన వారు ఆరోగ్య కేంద్రాల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవ‌చ్చు.

ఇక డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ కేంద్రాలు కేవ‌లం సెకండ్ డోస్ తీసుకునే వారికి మాత్ర‌మే నిర్దేశించిన‌వ‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. తొలి డోసు తీసుకున్న వారికి టైం స్లాట్ ను సూచిస్తూ ఎస్ఎంఎస్ వ‌స్తుంద‌ని, అందులో నిర్దేశించిన స‌మ‌యానికి డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ కేంద్రాల‌కు వెళ్లి సెకండ్ డోస్ తీసుకోవ‌చ్చు. ఫైజ‌ర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికైతే 21 రోజుల త‌ర్వాత‌...మోడ‌ర్నే వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి అయితే తొలి డోస్ తీసుకున్న 28 రోజుల త‌ర్వాత టైం స్లాట్ కేటాయిస్తారు.  ఎతెరాజ్ గ్రీన్ స్టేట‌స్ ఉండాలి, వ్యాక్సినేష‌న్ కార్డుతో పాటు, ఖ‌తార్ ఐడీ కార్డును వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సొంత కారు లేదా ట్యాక్సీలో వెళ్లిన వారిని మాత్ర‌మే అనుమ‌తిస్తారు.ఒక వేళ ఎస్ఎంఎస్‌లో నిర్దేశించిన స‌మ‌యంలో ఏ కార‌ణం చేత‌నైనా సెకండ్ డోస్ తీసుకోవ‌టంలో విఫ‌లం అయితే..వారు ఆరోగ్య కేంద్రాల్లో అపాయింట్మెంట్ తీసుకొని రెండో డోస్ తీసుకొవ‌చ్చు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com