రేపు కువైట్ నుంచి భారత్ కు చేరుకోనున్న కోవిడ్ రిలీఫ్ సామాగ్రి
- April 30, 2021
కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారత్ లో చాలా మంది ప్రజలకు సరైన వైద్య సాయం అందక అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఆక్సిజన్ కొరతతో చికిత్స అందక వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై చలించిన కువైట్ భారత్ కు బాసటగా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు మెడికల్ కిట్లను సాయంగా అందిస్తామని ఇదివరకే ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, వెంటిలేటర్లు, వివిధ సైజుల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను పంపిస్తోంది. శనివారం నాటికి తొలి విడత మెడికల్ కిట్లు భారత్ కు చేరుకుంటాయని ఢిల్లీలోని కువైట్ రాయభారి జస్సిమ్ అల్ నజీమ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్







