రేపు కువైట్ నుంచి భార‌త్ కు చేరుకోనున్న‌ కోవిడ్ రిలీఫ్ సామాగ్రి

- April 30, 2021 , by Maagulf
రేపు కువైట్ నుంచి భార‌త్ కు చేరుకోనున్న‌ కోవిడ్ రిలీఫ్ సామాగ్రి

కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో భార‌త్ లో చాలా మంది ప్ర‌జ‌ల‌కు స‌రైన వైద్య సాయం అంద‌క అవ‌స్థ‌లు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఆక్సిజ‌న్ కొర‌త‌తో చికిత్స అంద‌క వేల‌ల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై చ‌లించిన కువైట్ భార‌త్ కు బాస‌ట‌గా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌తో పాటు మెడిక‌ల్ కిట్ల‌ను సాయంగా అందిస్తామ‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించింది. ఇచ్చిన హామీ మేర‌కు తొలి విడ‌త‌గా ఆక్సిజ‌న్ కాన్స‌ట్రేట‌ర్స్‌, వెంటిలేట‌ర్లు, వివిధ సైజుల్లో ఉన్న ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను పంపిస్తోంది. శ‌నివారం నాటికి తొలి విడ‌త మెడిక‌ల్ కిట్లు భార‌త్ కు చేరుకుంటాయ‌ని ఢిల్లీలోని కువైట్ రాయభారి జస్సిమ్ అల్ నజీమ్ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com