భారత్ నుంచి బహ్రెయిన్ వచ్చే విమానాలను నిషేధించాలి
- April 30, 2021
మనామా: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది.దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది.భారత్‌లో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలని బహ్రెయిన్ ఎంపీలు అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. అంతకంతకు కేసులు పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాల కొరత ఏర్పడుతుండడం భారత్‌లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేస్తుందని బహ్రెయిన్ పార్లమెంట్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వెంటనే భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై బ్యాన్ వేయాలని, అలాగే భారత ప్రయాణికులను కూడా దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించాలని ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఇప్పటికే బహ్రెయిన్.. భారత్ సహా మూడు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బహ్రెయిన్ వచ్చే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులు ప్రయాణానికి 48 గంటల ముందు పీసీఆర్ టెస్టు చేయించుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. కాగా, బహ్రెయిన్‌లో 4.5లక్షల నుంచి 5 లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు సమాచారం.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్









