మహారాష్ట్రలో లాక్డౌన్ గడువు పొడిగింపు..
- April 30, 2021
ముంబై: భారత్ లో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాప్తిచెందుతోంది.కేసులు, మరణాల పరంగా దేశంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు వేలాదిగా పెరిగిపోతున్నాయి.కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. వైరస్ అదుపులోకి రావడంలేదు.ఈ మేరకు దాదాపు నెలనుంచి నైట్ కర్ఫ్యూను ఆ తర్వాత లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.ఈ క్రమంలో లాక్డౌన్ ఆంక్షలను మరో 15 రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరో 15 రోజుల పాటు ఈ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలు మరో 15 రోజులపాటు కొనసాగుతాయని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గురువారం క్యాబినేట్ కూడా సమావేశమైంది. కాగా.. కరోనా విస్తృతి నేపథ్యంలో ఏప్రిల్ 21న బ్రేక్ ది చెయిన్ క్యాంపెయిన్ కింద రాష్ట్రవ్యాప్తంగా మే 1 వరకు లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రేపటితో ఈ ఆంక్షల గడువు ముగుస్తున్న కారణంగా.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







