మహారాష్ట్రలో లాక్‌డౌన్ గడువు పొడిగింపు..

- April 30, 2021 , by Maagulf
మహారాష్ట్రలో లాక్‌డౌన్ గడువు పొడిగింపు..

ముంబై: భారత్ లో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాప్తిచెందుతోంది.కేసులు, మరణాల పరంగా దేశంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు వేలాదిగా పెరిగిపోతున్నాయి.కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. వైరస్ అదుపులోకి రావడంలేదు.ఈ మేరకు దాదాపు నెలనుంచి నైట్ కర్ఫ్యూను ఆ తర్వాత లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.ఈ క్రమంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరో 15 రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరో 15 రోజుల పాటు ఈ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలు మరో 15 రోజులపాటు కొనసాగుతాయని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గురువారం క్యాబినేట్ కూడా సమావేశమైంది. కాగా.. క‌రోనా విస్తృతి నేప‌థ్యంలో ఏప్రిల్ 21న బ్రేక్ ది చెయిన్‌ క్యాంపెయిన్ కింద రాష్ట్ర‌వ్యాప్తంగా మే 1 వ‌ర‌కు లాక్‌డౌన్ త‌ర‌హా క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రేప‌టితో ఈ ఆంక్షల గ‌డువు ముగుస్తున్న కారణంగా.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com